‘ది ప్యారడైజ్‌’లో నాని తల్లి ఎవరో తెలుసా?

‘ది ప్యారడైజ్‌’ సినిమాలో హీరో నాని తల్లి సమ్మక్క పాత్రలో సోనాలీ కులకర్ణి నటించారు. ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. 1992లో సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన సోనాలీ.. 2000లో వచ్చిన ‘మిషన్‌ కశ్మీర్‌’లో 26 ఏళ్ల వయసులోనే హృతిక్‌ రోషన్‌ తల్లిగా నటించారు. అనంతరం తల్లి పాత్రలతో పాటు హీరోయిన్‌గానూ మెప్పించారు. 2013లో ఆమె నటించిన ‘ది గుడ్‌ రోడ్‌’ 86వ ఆస్కార్‌ అవార్డులకు భారత తరఫున అధికారికంగా ఎంపికైంది. తాజాగా ‘ది ప్యారడైజ్‌’లో సమ్మక్కగా ఆకట్టుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕