హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకుందనే వార్తల వేళ ఆమె భర్త రాజ్ నిడిమోరు గురించి సోషల్ మీడియాలో చర్చ షురూ అయింది. రాజ్ నిడిమోరు తిరుపతిలో 1975లో జన్మించారు. ఎస్వీయూలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసి అమెరికాలో ఉద్యోగం చేశారు. సినిమాలపై ఆసక్తితో ఫిల్మ్‌మేకింగ్‌లోకి వచ్చి, 2002లో ‘షాదీ.కామ్’ ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో భారీ గుర్తింపు పొందారు. రెండో సీజన్‌లో సమంత నటించడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని.. ఇవాళ వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారని టాక్.