నిద్రలో ఎందుకు మాట్లాడతారో తెలుసా?

రాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు కొందరు అకస్మాత్తుగా ఏదో మాట్లాడటం, నవ్వడం, గుసగుసలాడటం వంటివి చేస్తుంటారు. దీనిని 'స్లీప్‌ టాకింగ్‌' అంటారు. నిద్రిస్తున్నప్పుడు మెదడులోని కొన్ని భాగాలు చురుగ్గా ఉండటం వల్ల మాటలు బయటకు వస్తాయి. ముఖ్యంగా 'ర్యాపిడ్ ఐ మూమెంట్' (REM) నిద్ర దశలో వచ్చే కలల ప్రభావం కూడా దీనికి ఒక కారణం. పెద్దల కంటే పిల్లల్లోనూ, శరీరం బాగా అలసిపోయినప్పుడు ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇది చాలా సాధారణమైన విషయం, అప్పుడప్పుడు జరిగితే ఎలాంటి ప్రమాదం ఉండదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕