శివుడికి బిల్వ పత్రం అంటే ఎందుకు ఇష్టమో తెలుసా?

చాలా మంది భక్తులు శివుడికి బిల్వ పత్రాలను సమర్పిస్తు ఉంటారు. అయితే శివుడికి బిల్వ పత్రాలు అంటే ఎందుకు ఇష్టమో తెలుసా? పార్వతి దేవి శివుడిని వివాహం చేసుకోవడానికి అడవిలో తపస్సు చేసి, బిల్వ పత్రాలతో ఆయనను ప్రసన్నం చేసుకుంది. దీంతో శివుడు ఆమెను భార్యగా స్వీకరించాడు. స్కంద పురాణం ప్రకారం.. బిల్వ చెట్టు పార్వతి చెమట నుంచి ఉద్భవించింది. ఈ మొక్కను లక్ష్మీదేవి నివాసంగా భావిస్తారు. అందుకే శివుడికి బిల్వ పత్రాలు సమర్పించడం వల్ల అదృష్టం వస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్