రాత్రిపూట మీకు తరచుగా దాహం వేసి నీళ్లు తాగాల్సి వస్తుందా..? అయితే దీన్ని చిన్న సమస్యగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇది మీ శరీరంలో ఏదో ఒక ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. వైద్య పరిభాషలో దీనిని పాలీడిప్సియా అంటారు. ఇది శరీరంలో నీటి సమతుల్యతలో మార్పుకు సంకేతం కావొచ్చు. ఇది మధుమేహం, కిడ్నీ సమస్యలు, స్లీప్ అప్నియా, లేదా ఉప్పు, మద్యం, కాఫీ ఎక్కువ తీసుకోవడం వల్ల కలగొచ్చు. ఇలా తరచూ దాహం వేస్తే వెంటనే వైద్య సలహా తీసుకోవాలి.