నిద్రలో చెమటలు పడుతున్నాయా?

కొంతమందికి వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ రాత్రిళ్లు నిద్రలో చెమటలు పడుతుంటాయి. ఇది అనారోగ్యాలకు సంకేతం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైపర్ థైరాయిడ్, ఒత్తిడికి గురైనప్పుడు, మానసిక రుగ్మతల వల్ల నిద్రలో చెమటలు పడతాయి. మెనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో ఈ లక్షణం ఉంటుంది. కాబట్టి బరువు అదుపులో ఉంచుకోవడం, కెఫీన్, మసాలాలు, చాక్లెట్లకు దూరంగా ఉండటం, యోగా వంటివి చేయడం వల్ల ఈ సమస్యను కొంతమేర తగ్గించొచ్చు అంటున్నారు నిపుణులు.

సంబంధిత పోస్ట్