ఇయర్‌ఫోన్స్ లేదా ఇయర్‌బడ్స్‌ను గంటల తరబడి ఎక్కువగా ఉపయోగించడం వల్ల చెవుల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. వైద్యుల ప్రకారం ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎక్కువ శబ్దంతో, దీర్ఘకాలం పాటు వినడం వల్ల చెవిలోని సున్నితమైన కణాలు దెబ్బతిని వినికిడి సామర్థ్యం క్రమంగా తగ్గుతుంది. ఇయర్‌బడ్స్‌ను నిరంతరం పెట్టుకోవడం వల్ల గాలి ఆడక చెవిలో మైనం పేరుకుపోయి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.