భార్య, ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్న వైద్యుడు

తమిళనాడులో దారుణం జరిగింది. చెన్నైలోని అన్నానగర్‌కు చెందిన డాక్టర్ బాలమురుగన్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఆయనకు భార్య సుమతి (న్యాయవాది), ఇద్దరు కుమారులు ఉన్నారు. అల్ట్రాసౌండ్ కేంద్రాల ఏర్పాటుకు చేసిన అప్పులు, అలాగే వడ్డీ వ్యాపారుల ఒత్తిడి కారణంగా ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్