గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం పేరుతో 25 ఏళ్ల యువతిపై డాక్టర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల అల్సర్ చికిత్సకు వచ్చిన యువతిపై డాక్టర్ వ్రాజ్ పటేల్ శారీరక పరీక్షల నెపంతో ప్రైవేట్ పార్ట్స్‌పై అసభ్యంగా ప్రవర్తించాడు. అక్టోబర్ 4న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, డాక్టర్ వ్రాజ్ పటేల్‌పై BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని కోర్టు రిమాండ్‌కు తరలించడంతో సెంట్రల్ జైలుకు తరలించారు.