కాలికి శస్త్రచికిత్స చేసి సర్జికల్‌ బ్లేడ్‌ మర్చిపోయి కుట్లు వేసిన డాక్టర్లు

AP: కాకినాడ జిల్లా తుని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. కాలి శస్త్రచికిత్స కోసం వచ్చిన రామకృష్ణా నగర్‌కు చెందిన చిన్నాకు వైద్యులు స్క్రూ తొలగించే సమయంలో సర్జికల్ బ్లేడ్‌ను కాలు లోపలే మర్చిపోయి కుట్లు వేశారు. ఆపై ఎక్స్‌రేలో విషయం బయటపడటంతో బాధితుడు తిరిగి వైద్యులను సంప్రదించగా, మరోసారి శస్త్రచికిత్స చేసి బ్లేడ్‌ను తొలగించారు. ప్రస్తుతం యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్