బంగ్లాదేశ్‌లో ఒక గేదెకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టడం ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను ఆకర్షిస్తోంది. దాదాపు 700 కిలోల బరువున్న ఈ గేదె, బంగారు రంగు జుట్టు, గులాబీ చర్మంతో ప్రత్యేకంగా ఉంది. దాని తలపై ఉన్న జుట్టు శైలి, రంగు ట్రంప్‌ను పోలి ఉండటంతో యజమానులు ఈ పేరు పెట్టారు. ఇదే ఫామ్‌లో మరో గేదెకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేరు కూడా పెట్టారు. ఈ వింత వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.