బడ్జెట్ ముందు.. ఫ్లాట్‌గా దేశీయ మార్కెట్ సూచీలు

కేంద్ర బడ్జెట్ కోసం దేశం ఎదురుచూస్తున్న తరుణంలో.. ఆదివారం దేశీయ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.35 గంటలకు సెన్సెక్స్ 25 పాయింట్ల లాభంతో 82,294 వద్ద, నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో 25,303 వద్ద ట్రేడయ్యాయి. సన్‌ఫార్మా, బజాజ్ ఆటో, భారత్ ఎలక్ట్రానిక్స్, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉండగా, హిందాల్కో, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, కోల్ ఇండియా స్టాక్స్ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. బడ్జెట్ నేపథ్యంలో ఆదివారం కూడా మార్కెట్లు తెరిచి ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్