దేశీయ మార్కెట్ సూచీలు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 282 పాయింట్ల నష్టంతో 82,200 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 75 పాయింట్లు క్షీణించి 25,074 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సూచీలో ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఓఎన్‌జీసీ, సన్‌ఫార్మా, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ట్రెంట్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, ఫిన్‌సర్వ్, ఇన్ఫోసిస్, మహీంద్రా, టాటా మోటార్స్ స్టాక్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.