దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:33కి సెన్సెక్స్ 188 పాయింట్ల నష్టంతో 81,003 వద్ద, నిఫ్టీ 36 పాయింట్లు క్షీణించి 24,730 వద్ద ట్రేడవుతోంది. ట్రంప్ 25% సుంకాలు, భారత చమురు కంపెనీలపై ఆంక్షలు.. మార్కెట్‌ను ప్రభావితం చేశాయి. హెచ్‌యూఎల్, హీరో మోటో లాభాల్లో ఉండగా, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్ నష్టాల్లో ఉన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.58 గా ఉంది.