నష్టాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు

దేశీయ మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం కొనసాగుతుండటంతో చమురు ధరలు పెరిగాయి. దీని ప్రభావంతో సూచీలు పడిపోయాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 1000 పాయింట్ల వరకు నష్టపోయింది. ఉదయం 9.33 గంటలకు సెన్సెక్స్ 868 పాయింట్లు పతనమై 76,623 వద్ద, నిఫ్టీ 278 పాయింట్లు క్షీణించి 23,899 వద్ద ట్రేడయ్యాయి. రూపాయి విలువ కూడా అంతర్జాతీయ మార్కెట్‌‌లో 95.07 వద్ద సరికొత్త కనిష్ఠాన్ని తాకింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్