పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో భారత స్టాక్ మార్కెట్లు బుధవారం సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందన్న వార్తలతో పెట్టుబడిదారుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సూచీలు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ దాదాపు 2,900 పాయింట్లు పెరిగి 77,600 మార్కును తాకగా, నిఫ్టీ 890 పాయింట్లు పెరిగి 24,000 మైలురాయిని దాటింది. ఒక్క రోజులోనే పెట్టుబడిదారుల సంపద రూ.16 లక్షల కోట్లు పెరిగింది.