స్వల్ప నష్టాల్లో మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. నిఫ్టీ 12 పాయింట్లు పెరిగి 24,067 వద్దకు చేరగా, సెన్సెక్స్ 64 పాయింట్లు తగ్గి 77,033 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 101.34, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 72.4 డాలర్లుగా ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.38 శాతానికి చేరాయి. గత సెషన్‌లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.05 శాతం, నాస్‌డాక్ 0.24 శాతం నష్టపోయాయి.

సంబంధిత పోస్ట్