దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాన్ని భారీ నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు సూచీలపై ప్రతికూల ప్రభావం చూపడంతో సోమవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా, నిఫ్టీ 23వేల మార్క్‌ను కోల్పోయి కుప్పకూలాయి. దీంతో క్షణాల వ్యవధిలో రూ.6 లక్షల కోట్ల మేర మదుపర్ల సంపద ఆవిరైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శాంతి ప్రతిపాదనలను తిరస్కరించినట్లు వచ్చిన వార్తలతో చమురు ధరలు పెరగడం, అమెరికా బాండ్ల ప్రతిఫలాలు 5% పైన కొనసాగడం, విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలు మార్కెట్ పతనానికి కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు.