TG: మంత్రివర్గ విస్తరణకు అనుమతి ఇవ్వొద్దని బీజేపీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తోందని, ఒక వర్గం ఓట్ల కోసమే ఈ విస్తరణ చేపడుతోందని వారు ఆరోపించారు. గతంలో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసిన అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాగా అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే.