సర్‌ను అలా మార్చొద్దు.. రాజ్యసభలో కమల్‌ హాసన్‌

తమిళనాడులో కొనసాగుతోన్న ఎన్నికల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు, ప్రముఖ నటుడు కమల్‌ హాసన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో మాట్లాడిన ఆయన ఎన్నికల సంఘం రాష్ట్ర ఓటర్ల హక్కులను తనిఖీ చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ‘‘బిహార్‌లో బతికున్న వారిని చనిపోయిన వారి ఓటర్ల జాబితాలో చేర్చారు. అటువంటి పరిస్థితి దేశమంతటా వ్యాప్తి చేయొద్దని కోరుకుంటున్నాం’’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్