మిర్చి రైతులను మోసం చేయొద్దు.. జగన్‌ సంచలన ట్వీట్

AP: మిర్చి రైతులను మోసం చేయొద్దని ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. 'రైతులు పంటపై రూ.లక్షన్నర పైన పెట్టుబడి పెట్టి రూ.10వేలకు అమ్ముకోవాల్సిన దుస్థితి. మీరు తక్షణమే రైతుల్ని ఆదుకునేలా చర్యలు తీసుకోండి. ఈ సంక్షోభం నుంచి రైతులు బయటపడేలా, వారికి ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెంటనే కొనుగోళ్లు ప్రారంభించండి. నేను రైతు పక్షపాతిని. మీరు ఎన్నికేసులు పెట్టినా రైతులకోసం, ప్రజలకోసం నిలబడతాను.' అంటూ చంద్రబాబును ట్యాగ్ చేశారు.

సంబంధిత పోస్ట్