ప్రెషర్ కుక్కర్‌లో గుడ్లు, ఆకుకూరలు, బంగాళాదుంపలు, నూడుల్స్ వంటివి ఉడికించడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఒత్తిడి వల్ల గుడ్లు పగిలిపోయే అవకాశం ఉందని, ఆకుకూరలు, నూడుల్స్ అతిగా ఉడికి రుచి, పోషకాలను కోల్పోతాయని తెలిపారు. వేపుడు వంటకాలను కూడా ప్రెషర్ కుక్కర్‌లో చేయకూడదని, దీనివల్ల నూనె చిమ్మి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. త్వరగా అవ్వాలనే ఉద్దేశ్యంతో ప్రెషర్ కుక్కర్‌లో కొన్ని పదార్థాలను వండటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, కాబట్టి కొన్ని వంటకాలను ప్రెషర్ కుక్కర్‌లో వండకపోవడమే మంచిదని సూచించారు.