నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న చేపలు తినొద్దు: ప్రభుత్వం

బీహార్‌లో వరదల నేపథ్యంలో కొత్త ఆందోళన మొదలైంది. నేపాల్ నుంచి వచ్చిన వరద నీటితో పాటు కొన్ని ప్రాంతాలకు అసాధారణంగా భారీ చేపలు కొట్టుకొచ్చాయి. వీటిని తిన్న కొందరు అనారోగ్యానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో, బీహార్ డెయిరీ, ఫిషరీస్‌ అండ్‌ యానిమల్‌ రిసోర్సెస్‌ డిపార్ట్‌మెంట్‌లోని ఫిషరీస్‌ డివిజన్‌ ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు వరద నీటిలో పట్టిన చేపలను తినకూడదని అధికారులు హెచ్చరించారు. వరదల సమయంలో చేపలు మురుగునీరు, వ్యర్థాలు, కలుషిత పదార్థాలతో సంబంధంలోకి వచ్చి బ్యాక్టీరియా, వైరస్‌లు, ఫంగస్‌లు చేరే ప్రమాదం ఉందని, ఇలాంటి చేపలను తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్