వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత మహిళా క్రికెటర్లకు కానుకలు, ప్రచారకర్తలుగా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, కొన్ని కంపెనీల అబద్ధపు వాగ్దానాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సునీల్ గవాస్కర్ వారికి సూచించారు. 1983లో తమకు ఎదురైన అనుభవాలను గుర్తుచేశారు. ఉచిత పబ్లిసిటీ కోసం కొందరు వ్యక్తులు, ప్రకటన సంస్థలు, కంపెనీలు క్రికెటర్లను వాడుకోవడానికి ప్రయత్నిస్తాయని తెలిపారు. ప్రకటనల విషయంలో ఆచితూచి అడుగేయాలని సూచించారు. కాగా వరల్డ్ కప్ విజయంతో జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వంటి ఆటగాళ్ల బ్రాండ్ వాల్యూ గణనీయంగా పెరిగింది.