చిగుళ్ల నుంచి రక్తం కారుతోందా?

పళ్లు తోముకునేటప్పుడు లేదా గట్టి ఆహారం నమిలేటప్పుడు చిగుళ్ల నుంచి రక్తం కారడాన్ని నిర్లక్ష్యం చేయొద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం నోటి పరిశుభ్రత లోపమే కాకుండా, చిగుళ్ల వ్యాధులు, విటమిన్ లోపాలు, మధుమేహం వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చని వారు తెలిపారు. జింజివైటిస్, పీరియాడోంటైటిస్ వంటి వ్యాధులు, విటమిన్ సి, కె లోపం, ధూమపానం, గట్టిగా బ్రష్ చేయడం వంటివి రక్తస్రావానికి కారణమవుతాయి. కొన్ని రోజులుగా ఆగని రక్తస్రావం, నొప్పి, వాపు, నోటి దుర్వాసన, పళ్లు కదలడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే దంతవైద్యుడిని సంప్రదించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్