భారత్‌కు నీతులు చెప్పొద్దు: ఇటలీ నేత

హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన భారత్‌ సమిట్‌లో ఇటలీ వామపక్ష పీఈసీ నాయకుడు జియాకోమో ఫిల్‌బెక్‌ చేసిన ‘ఓట్‌ చోర్‌ గద్దీ చోడ్‌’ వ్యాఖ్యలపై వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి చెందిన పార్టీ భారత్‌కు మద్దతుగా నిలిచింది. 97 కోట్ల మంది ఓటర్లకు అవకాశం కల్పిస్తున్న దేశంపై ప్రజాస్వామ్య వ్యాఖ్యలు చేయడం సరికాదని పార్టీ నేత డెబోరా బెర్గామిని హితవు పలికారు. భారత్‌లో ప్రజాస్వామ్య ప్రక్రియను కించపరిచేలా ఉన్న ఆ నాయకుడి వ్యాఖ్యలను ఇటలీ అధికార పార్టీ ఖండించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕