TG: మావోయిస్టులను ఉద్దేశించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం వేములవాడ ఏరియా ఆసుపత్రికి రూ.1.5 కోట్ల విలువైన వైద్య పరికరాల అందజేత కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మావోయిస్టులారా.. అర్బన్ నక్సలైట్లను నమ్మి మోసపోవద్దని, వారు ఏ పార్టీ అధికారంలో ఉన్నా పైరవీలు చేసుకుంటూ ఆస్తులు పోగేసుకుంటున్నట్లు తెలిపారు. వాళ్ల మాటలు నమ్మి అమాయక పేదలు తుపాకీ పట్టి ప్రాణాలు కోల్పోవద్దని సూచించారు. మావోయిస్టుల చావుకు అర్బన్ నక్సల్స్ కారకులని హెచ్చరించారు.