చెవి గులిమిని తొలగించేటప్పుడు ఈ తప్పులు చేయకండి!

మీ చెవుల్లో పేరుకుపోయే గులిమిని (ఇయర్‌వాక్స్) తొలగించేటప్పుడు చాలామంది చేసే సాధారణ తప్పులను నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేళ్లు, అగ్గిపుల్లలు లేదా ఇయర్ క్లీనర్లతో గులిమిని తొలగించడానికి ప్రయత్నించడం వల్ల చెవిపోటు, ఇన్ఫెక్షన్లు, చీము వంటి సమస్యలు రావచ్చని వైద్యులు తెలిపారు. ఇయర్‌వాక్స్ అనేది చెవిని దుమ్ము, బ్యాక్టీరియా నుండి రక్షించే సహజ పొర అని, అధికంగా పేరుకుపోతేనే సమస్య అని వివరించారు. చెవిలో నొప్పి, నీరు కారడం, వినికిడి లోపం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. ENT వైద్యులు ప్రత్యేక పరికరాలతో సురక్షితంగా గులిమిని తొలగిస్తారని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్