ఆకాశంలో అద్భుతం.. 'బ్లూ మూన్‌'ను అస్సలు మిస్ కాకండి!

ఖగోళ ప్రియులకు ఆదివారం (మే 31న) అరుదైన బ్లూ మూన్ దర్శనం కానుంది. ఒకే నెలలో రెండు పౌర్ణములు సంభవిస్తే రెండో పౌర్ణమిని ‘బ్లూ మూన్’గా పిలుస్తారు. మే 1న తొలి పౌర్ణమి, మే 31న రెండో పౌర్ణమి రావడంతో ఈసారి బ్లూ మూన్ ఏర్పడుతోంది. అయితే పేరులో ‘బ్లూ’ ఉన్నప్పటికీ చంద్రుడు నీలం రంగులో కనిపించడు. ఈసారి ఇది మైక్రోమూన్ కూడా కావడంతో చంద్రుడు సాధారణ పౌర్ణమి కంటే కొద్దిగా చిన్నగా, మసకగా కనిపించవచ్చు. భారతదేశంలో మే 31 సాయంత్రం 6:30 నుంచి 7:30 గంటల మధ్య ఈ అరుదైన ఖగోళ దృశ్యాన్ని వీక్షించే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు.

సంబంధిత పోస్ట్