రైల్వే స్టేషన్ల అప్రోచ్ రోడ్లపై నిర్లక్ష్యం వద్దు: కిషన్ రెడ్డి

TG: చర్లపల్లి రైల్వే టెర్మినల్, సికింద్రాబాద్ స్టేషన్ల వద్ద అప్రోచ్ రోడ్ల విస్తరణ, భూసేకరణ పనులను తక్షణమే చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ముఖ్యంగా చర్లపల్లి స్టేషన్ అవసరాల దృష్ట్యా ఎఫ్.సి.ఐ గోడౌన్ రోడ్డును, భరత్ నగర్, ఈసీ నగర్ వైపు ఉన్న రహదారులను విస్తరించడంతో పాటు, పార్కింగ్ కోసం సుమారు 5.70 ఎకరాల భూమిని కేటాయించాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు. ఆయా స్టేషన్‌లకు నీటి సరఫరా కనెక్షన్‌ను త్వరగా పూర్తి చేయాలని కిషన్ రెడ్డి కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్