ఫేక్ వెబ్‌సైట్లు, వాట్సాప్ లింకులను ఓపెన్ చేయొద్దు: కేంద్రం

LPG సిలిండర్ బుకింగ్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. ఫేక్ వెబ్‌సైట్లు, వాట్సాప్ లింకులు, నకిలీ కాల్స్, ఏపీకే (APK) ఫైళ్లను క్లిక్ చేయవద్దని, ఇన్‌స్టాల్ చేయవద్దని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. వీటి ద్వారా వినియోగదారుల బ్యాంక్ వివరాలు, OTPలు సేకరించి సైబర్ నేరగాళ్లు బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేస్తారని తెలిపింది. కేవలం అధికారిక వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారానే బుకింగ్ చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్