పండ్లను ఫ్రిజ్‌లో పెట్టొద్దు: నిపుణులు

పండ్లను రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల వాటి సహజ రుచి, ఆకృతి దెబ్బతింటాయి. పచ్చి పండ్లను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల అవి సరిగా పండవు, తొక్కలు నల్లబడి పాడైపోతాయి. మామిడి, అరటి, బొప్పాయి, అనాస, పుచ్చకాయ, కర్బూజా, లీచీ, పీచ్, ప్లమ్ వంటి పండ్లను గది ఉష్ణోగ్రత వద్దే పండనివ్వాలి. పూర్తిగా పండిన తర్వాతే చల్లబరచడానికి ఫ్రిజ్‌లో ఉంచాలి. కోసిన పండ్లను గాలి చొరబడని డబ్బాలో పెట్టి రెండు రోజుల్లోపు తినడం మంచిది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్