అకాల వర్షాలను రాజకీయాలకు వాడొద్దు : మంత్రి శ్రీధర్‌బాబు

TG: రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు అకాల వర్షాలను రాజకీయాల కోసం వాడుకోవద్దని ప్రతిపక్షాలకు సూచించారు. కేంద్రంలోని బీజేపీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో విఫలమైందని, ఎరువుల ధరలు పెంచి, నల్ల చట్టాలతో అన్యాయం చేసిందని విమర్శించారు. తెలంగాణలో రైతు గోస-బీజేపీ భరోసా పేరిట యాత్రలు చేస్తున్నారని, ఇది అధికారం కోసం బీజేపీ నాయకులు చేస్తున్న రాజకీయ ఘోష అని మండిపడ్డారు. ప్రతిపక్షాలు ఆటంకాలు సృష్టించినా, చివరి గింజ కొనే వరకు ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రైతులు దుష్ప్రచారాన్ని నమ్మి ఆందోళనకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్