ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం త్వరలోనే ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. నవంబర్ 3న అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కన్సాస్ సిటీలోని కేసీఎంఓ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది త్వరలోనే ముగిసిపోతుంది. ఇరాన్ అణ్వాయుధాన్ని ఎప్పటికీ కలిగి ఉండదనే హామీ మాకు కావాలి’’ అని పేర్కొన్నారు. అయితే యుద్ధం ముగింపు ఎలా ఉంటుందనే విషయాన్ని వెల్లడించలేదు. ఎన్నికలకు ముందు ఇరాన్‌పై దాడులు చేయబోమని ట్రంప్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.