క్యూర్‌ పరిధిలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు.. ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపిక

TG: క్యూర్‌ పరిధిలోని 26 ప్రాంతాల్లో 21 వేల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం పూర్తయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెల 30లోగా పారదర్శకంగా డ్రా పద్ధతిలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇళ్లకు 5–7 కి.మీ. పరిధిలోని అర్హులను ఎంపిక చేయాలని సూచించారు. కాలనీల్లో తాగునీరు, విద్యుత్‌, పారిశుధ్య సదుపాయాలను వచ్చే నెలాఖరులోగా కల్పించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్

✕
✕