ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. తాజాగా ఈ ఫలితాలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తోందని, డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడబోతుందని సంతోషం వ్యక్తం చేశారు. అద్భుతమైన విజయాన్ని అందించినందుకు ఢిల్లీ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.