భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవంపై సందిగ్ధత

AP: అల్లూరి సీతారామరాజు పేరుతో నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తయింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభోత్సవం కోసం ఎదురుచూస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం జూలై 5న ప్రారంభించాలని భావించినా, ప్రధాని పీఎంఓ నుంచి ఇంకా షెడ్యూల్ ఖరారు కాలేదు. ప్రత్యామ్నాయంగా జూలై 8 తేదీని కూడా సిద్ధం చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, కేంద్ర మంత్రివర్గ విస్తరణ వంటి కారణాలతో ప్రధాని బిజీగా ఉండటంతో ప్రారంభోత్సవంపై అనిశ్చితి నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్