అస్సాం ప్రముఖ గాయకుడు జుబిన్ గర్గ్ (52) శుక్రవారం సింగపూర్‌లో ప్రమాదవశాత్తూ మృతి చెందగా, ఆయన మరణంపై వివాదాలు తీవ్రతరం అవుతున్నాయి. సింగపూర్‌లో స్కూబా డైవింగ్‌లో ఆయన చనిపోయనట్టు తెలుస్తోంది. తాజాగా వచ్చిన మరణ ధృవీకరణ పత్రంపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సీరియస్‌గా దృష్టి సారించారు. పత్రాన్ని సీఐడీకి అప్పగించి పూర్తి దర్యాప్తు నిర్వహిస్తామని అభిమానులకు హామీ ఇచ్చారు.