ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో ఓటమి పాలైన టీమ్ఇండియా, ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. ఈ సిరీస్‌లో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేసే అవకాశాలున్నాయి. ఐర్లాండ్‌పై విఫలమైన సంజు శాంసన్, ఇషాన్ కిషన్‌లో ఒకరిని పక్కనబెట్టి, వైభవ్‌ను అభిషేక్‌తో కలిసి ఓపెనింగ్‌కు పంపే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొన్న వైభవ్, ఇంగ్లాండ్ పిచ్‌లపై ఎలా ఆడతాడో చూడాలి.