డైవర్ట్ చేయడానికే కేటీఆర్ అరెస్ట్ అంటూ డ్రామాలు: హరీశ్ రావు

TG: కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. దీంతో కేటీఆర్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. రైతు భరోసాను రూ.15 వేల నుంచి రూ.12 వేలకు తగ్గించారు.. యాసంగి పంటకు ఇచ్చే సాయం కూడా ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. దీంతో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి సర్కారు అందులోంచి డైవర్ట్ చేయడం కోసమే కేటీఆర్ అరెస్ట్ అంటూ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్