వేసవిలో లభించే పైనాపిల్, రుచికరంగా ఉండటమే కాకుండా జ్యూస్ చేసుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో కాల్షియం, ఫైబర్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. డీహైడ్రేషన్ తగ్గించడానికి, జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి పైనాపిల్ జ్యూస్ ఎంతగానో దోహదపడుతుంది. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి, బరువు తగ్గడానికి, కంటిచూపును మెరుగుపరచడానికి సహాయపడుతుంది.