ఉదయాన్నే బాదం టీ తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు

ప్రతి రోజు ఉదయాన్నే బాదం టీ తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని బాదం పప్పులను 15 నిమిషాల పాటు నానబెట్టిన తర్వాత.. వేడి పాలలో వేయాలి. దీంతో పాటు కొంచెం టీ డికాషన్‌, యాలకుల పొడి, తేనె, కుంకుమపువ్వు కలిపి సన్నని సెగపై పాలని మరిగిస్తే బాదం టీ సిద్ధం అవుతుంది. బాదం టీ లో విటమిన్ ఎ, ఇ, బి2, మెగ్నీషియం ఉంటాయి. వీటి వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. బరువును అదుపులో ఉంచుతుంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

సంబంధిత పోస్ట్