నైట్ డ్యూటీ సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నిద్ర రాకుండా ఉండేందుకు నైట్ డ్యూటీలో కొందరు టీ, కాఫీ అధికంగా తాగుతుంటారు. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. డ్యూటీ చేసి వచ్చాక 4 గంటలు, డ్యూటీకి వెళ్లే ముందు 2 గంటల నిద్ర తప్పనిసరి. నైట్ డ్యూటీ చేసే వారు మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో మద్యం తాగడం మానుకోవాలని సూచిస్తున్నారు.