iBOMMA రవికి మద్దతుగా ఆటోపై పోస్టర్ వేసుకున్న డ్రైవర్(వీడియో)

సినిమాలు పైరసీ చేస్తూ పట్టుబడ్డ iBOMMA రవిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే. ఆయితే తాజాగా రవికి కొందరు మద్దతు తెలుపుతూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ఆటో డ్రైవర్ తన ఆటోపై 'తెలంగాణ రియల్ హీరో iBOMMA రవి' అంటూ పోస్టర్ వేసుకుని రవికి మద్దతు తెలిపాడు. ఈ మేరకు ఆటోతో నగరంలో చక్కర్లు కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నేరగాళ్లకు ఇలాంటి సపోర్ట్ ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్