TG: హైదరాబాద్ పాతబస్తీలో ఆదివారం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు బాలుడిని ఢీకొట్టింది. దీంతో కారు కింద పడి బాలుడు నలిగిపోయాడు. కాంచన్ బాగ్ పీఎస్ పరిధిలోని బాబానగర్ ప్రాంతంలో అతి వేగంతో వచ్చిన కారు అమెర్ అలీ(8) అనే బాలుడి పైనుండి దూసుకెళ్లింది. వెంటనే స్పందించిన స్థానికులు కారు పక్కకి జరిపి, తీవ్ర గాయాలపాలైన బాలుడిని బయటకు తీశారు. అనంతరం బాలుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.