జెట్‌ బ్లూ విమానాన్ని ఢీకొన్న డ్రోన్‌

న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే ఇంటర్నేషనల్ విమానాశ్రయం సమీపంలో ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న జెట్ బ్లూ ఎయిర్లైన్స్ విమానాన్ని డ్రోన్ ఢీకొట్టింది. లాస్ వెగాస్ నుంచి వచ్చిన ఈ విమానం 3 వేల అడుగుల ఎత్తులో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలో 159 మంది ప్రయాణిస్తున్నారు. విమాన కాక్‌పిట్ వెలుపలి భాగాన్ని డ్రోన్ తాకిందని పైలట్ ఏయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు తెలిపారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదని, విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని జెట్ బ్లూ ఎయిర్లైన్స్ వెల్లడించింది.

సంబంధిత పోస్ట్