త్వరలో మెడికల్ ఎమర్జెన్సీలకు డ్రోన్లు ఉపయోగపడే అవకాశం ఉంది. ICMR సైంటిస్టులు డ్రోన్ ద్వారా బ్లడ్ డెలివరీ ప్రయోగం చేశారు. 15 నిమిషాల్లో 35 కిలోమీటర్ల దూరం చేరిన డ్రోన్.. అంబులెన్స్ కంటే గంట ముందే సేవలను అందించింది. ఈ విధమైన సేవలు పూర్తిస్థాయిలో వస్తే, మెడికల్ సరఫరాలు చౌకగా, వేగంగా అందుతాయని ఆశిస్తున్నారు.