ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కోటి రూపాయల విలువైన డ్రోన్లు స్వాధీనం

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ముగ్గురు భారతీయ ప్రయాణికుల వద్ద నుండి అక్రమంగా తరలిస్తున్న డ్రోన్లు, డ్రోన్ విడిభాగాలను స్వాధీనం చేసుకున్నారు. హాంకాంగ్ నుండి వియత్నాం మీదుగా ఢిల్లీకి చేరుకున్న వీరి వద్ద నుండి 11 రోబోటిక్స్ డ్రోన్లు, అడాప్టర్లు, USB ఛార్జర్లు, 60 ప్రొపెల్లర్లు, 10 కెమెరా ఎక్విప్డ్ జింబాల్స్, ఒక ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ఫోన్ తో పాటు మరికొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ కోటి రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. స్నేహితుడి కోసం తెచ్చామని ప్రయాణికులు చెప్పినప్పటికీ, విమాన ప్రయాణానికి ముందు కస్టమ్స్ అధికారులకు వెల్లడించలేదని తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕