ఫామ్‌హౌస్‌లో రూ.6.5 కోట్ల డ్రగ్స్ మెటీరియల్ సీజ్ (వీడియో)

TG: సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని పీచేర్యాగడి తండాలో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను మహారాష్ట్ర పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని బట్టబయలు చేసిన పోలీసులు, మూడు కిలోల మెఫెడ్రోన్, డ్రగ్స్ తయారీకి వాడే ముడిపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.6.5 కోట్లు ఉంటుందని అంచనా. ముంబై నుంచి ముడిపదార్థాలు తెచ్చి, మెట్రో నగరాలకు సరఫరా చేస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్