భార్యకు మత్తుమందు ఇచ్చి.. రెండు దశాబ్దాలుగా అత్యాచారం

బ్రిటన్‌కు చెందిన 60 ఏళ్ల వ్యక్తి తన భార్యకు మత్తుమందు ఇచ్చి రెండు దశాబ్దాలకు పైగా అత్యాచారానికి పాల్పడినట్లు కోర్టులో అంగీకరించాడు. మాంచెస్టర్‌ మిన్షుల్‌ స్ట్రీట్‌ క్రౌన్‌ కోర్టులో విచారణ సందర్భంగా 2004 నుంచి 2025 మధ్య జరిగిన 21 అత్యాచారాలు, 15 లైంగిక దాడులు, 11 లైంగిక వేధింపులు సహా మొత్తం 45 నేరాలను ఒప్పుకున్నాడు. భార్యను స్పృహ కోల్పోయేలా మత్తుమందు ఇచ్చి ఇంట్లోనే ఈ దారుణానికి పాల్పడినట్లు సోమవారం అంగీకరించాడు. ఈ కేసులో మరో 12 మంది నిందితులపై కూడా ఆరోపణలు ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕